
భారత దేశ జన గణన 2027 శిక్షణా కార్యక్రమం
నంద్యాల, న్యూస్ వెలుగు : శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తహశీల్దార్ ఈ పద్మావతమ్మ ఆధ్వర్యంలో మన భారత దేశ జన గణన 2027 కు సంబంధించిన శిక్షణా కార్యక్రమం గురువారం ఫేస్ 1 బ్యాచ్ కి మొదటిరోజు ప్రారంభమైంది. శిక్షణ ప్రారంభానికి ముందు వందేమాతరం దేశభక్తి గీతాన్ని ఆలపించారు. కచ్చితంగా శిక్షణకు హాజరయ్యే న్యూ మా లెటర్స్ సమయపాలన పాటించాలని, శిక్షణలో పూర్తి సమాచారం తెలుసుకొని ఎటువంటి పొరపాట్లు లేకుండా జనగణన చేయాలని ఏదైనా సందేశం వస్తే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తెలుసుకొని స్పష్టంగా గణన చేయాలని, ఎట్టి పరిస్థితిలో శిక్షణకు గైర్హాజరుకారాదని, గైర్హాజర్ అయిన వారి పై తీసుకోబోవు చర్యలకు తాము బాధ్యులను కామని తహశీల్దార్, ఏఎస్ఓ అరుణా దేవి తెలిపారు. ప్రస్తుత 2027 లో మీరు చేస్తున్న జనగణనలో బుడగ జంగం వారిని అదర్స్లో చేరవేయాలని వారికి ప్రభుత్వం నుండి డిక్లరేషన్ రాలేదని తహశీల్దార్ తెలిపారు. 2027 భారత జనాభా జన గణనను డిజిటల్ నిదానంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసిందని తగు అనుగుణంగా ప్రభుత్వ నిబంధనల మేరకు శిక్షణ ఇస్తున్నట్లు శిక్షకులు జి నరేంద్ర ,జి సుధాకర్, ఈర్నపాడు, సింగవరం జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ అసిస్టెంట్స్ పేర్కొన్నారు.

