
బండి ఆత్మకూరులో ఇంటర్ ఫలితాలలో ప్రథమ స్థానంలో బాలికలు
నంద్యాల, న్యూస్ వెలుగు: బండి ఆత్మకూరు మండలంలో ఇంటర్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలలో బాలికలు టాపర్లుగా నిలిచారు. బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలలో బండి ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 63 మందికి గాను 40 మంది పాసయ్యారని, 23 మంది ఫెయిల్ అయినట్లు 63.5 శాతం ఉత్తీర్ణత ద్వితీయ సంవత్సరంలో 95 మందికి గాను 84 మంది పాసైనట్లు 11 మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు 88.4 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ వెంకట నారాయణ తెలిపారు. వారు మాట్లాడుతూ.. జూనియర్ ఇంటర్ బై.పి.సి.లో ఏ. లక్ష్మి ప్రసన్న 397 మార్కులు, ఎం.పి.సి.లో పి. భారతి 394 మార్కులు, సి.ఈ.సి.లో ఏ. చంద్రకాంత్ 351 మార్కులు, అలాగే సీనియర్ ఇంటర్ ఎం.పి.సి లో జి. సునయన 939 మార్కులు, బై.పి.సి. లో యస్. యాస్మిన్ బేగం 903 మార్కులు, సి.ఈ.సి. లో సి. మాధవి 893 మార్కులు సాధించి ఆయా గ్రూప్ లలో అగ్రస్థానంలో నిలిచారు. వారిని పలువురు అభినందించారు. బండి ఆత్మకూరు కస్తూర్బా బాలికల కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 32 మంది విద్యార్థులకు గాను 29 మంది విద్యార్థులు పాసయ్యారని ఇద్దరు విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ప్రిన్సిపల్ దాక్షాయిని తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎస్. టి ఆసియా 430/455 మార్కులు, నాగలక్ష్మి 408 మార్కులు, ఎస్ దాక్షాయిని 388 /455 మార్కులు సాధించారని, 94 శాతం ఉత్తీర్ణత, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 22 మంది విద్యార్థులకు గాను 16 మంది విద్యార్థులు పాసయ్యారని, 06 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని తెలిపారు. టీ మానస 801 /1000 మార్కులు, గురు ప్రసన్న 779/1000, పి లావణ్య 778 /1000 మార్కులు సాధించారని, 73 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పలువురు వారిని అభినందించారు. బండి ఆత్మకూరు ఏపీ మోడల్ పాఠశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరం ఇంటర్ బైపీసీ విభాగంలో విజయమని 446, ఎంపీసీలో ప్రణవ నందా 448 మార్కులు, సీసీ సాయి సునంద 444 మార్కులు సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో వడ్ల సౌమ్య 969, సీఈసీ సాయి ప్రియ 932 మార్కులు, బైపిసి విభాగంలో మధు లోహిత 988 మార్కులతో పాఠశాల టాపర్ గా నిలిచినట్లు ప్రిన్సిపల్ సయ్యద్ రాఫీ తెలిపారు. ప్రథమ ఏడాదిలో 84.7%, ద్వితీయ ఏడాదిలో 92% ఉత్తీర్ణత నమోదైందన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పలువురు అభినందించారు.

