నంద్యాల, న్యూస్ వెలుగు : ఉద్యాన శాఖ, పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో వెలుగోడు మండల కేంద్రంలో శుక్రవారం ఆయిల్ పామ్ పంట సాగుపై

రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు ఆయిల్ పామ్ పంట సాగులో ప్రభుత్వం అందించే సబ్సిడీ ప్రయోజనాల గురించి అధికారులు వివరించారు. పతాంజలి మేనేజర్ ఎస్ రమణారెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్ కే చందన మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ సాగుచేసే రైతుకు 1 ఎకరాకు 50 మొక్కలు చొప్పున సంవత్సరం వయసుగల మొక్కలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఒక హెక్టార్కుకు 10,500/- రూపాయలు చొప్పున ఆయిల్ పామ్ పంటకాయ ఖర్చులకు అంతర్పంట సాగు కొరకు ప్రోత్సాహకగా అందివ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.. ఆయిల్ పామ్ మొక్కలు సాగు చేసుకుంటే 4 వ సంవత్సరం నుండి దిగుబడినిస్తూ 25 సంవత్సరాలు పాటు దిగుబడినిస్తుందని సంవత్సరానికి 1,00000 రూపాయలు నుండి 1,50,000 రూపాయలు ఎకరానికి ఆదాయం పొందవచ్చునన్నారు. ఈ పంటను సాగు చేసుకునేందుకు ప్రధానంగా నీటి వసతి కలిగి ఉండాలి ఆసక్తిగల రైతులు తమ గ్రామంలోని రైతు సేవ కేంద్రాలలో సంప్రదిస్తే పతాంజలి కంపెనీ సిబ్బంది మరియు ఉద్యాన శాఖ ద్వారా రైతులకు మొక్కలు అందించగలనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ కే చందన , వెలుగోడు మండల వ్యవసాయ అధికారి స్వాతి , పతాంజలి మేనేజర్ ఎస్ రమణారెడ్డి , డిప్యూటీ మేనేజర్ నాగరాజు, రైతు కాసారపు రఘు స్వామి రెడ్డి , రైతు సేవ కేంద్రం సిబ్బంది మరియు పిఎఫ్ఎల్ సిబ్బంది, రైతు సోదరులు పాల్గొన్నారు.
Thanks for your feedback!