
తుగ్గలిలో ఉపాధి హామీ నయా మోసం… ఊరికో ఏజెంట్ తో డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు
పేదల కడుపు కొడుతున్న ఉపాధి హామీ మాఫియా
అధికారులకు ముడుతున్న నగదు
పేరుకు మాత్రమే అధికారుల తనిఖీలు
ఊరుకో ఏజెంట్ ని పెట్టుకుని డబ్బులు వసూలు..
నాయకుల అండదండలతో… నయా మోసం
లక్షల రూపాయలు ప్రభుత్వ నగదు గోల్ మాల్
తుగ్గలి ఏప్రిల్ ( న్యూస్ వెలుగు ) : ఉపాధి హామీ పథకంలో అవినీతికి అంతులేకుండా పోయింది. అనినీతి నిర్ములనకు ప్రభుత్వం ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్న… అధికారులు ఉపాధి హామీ మేటిలకు హింట్ ఇచ్చి టెక్నీకల్ మాయాజాలం… పేస్ రికగనైజేషన్ పేరుతుతోనూ.. వీడియో కాల్ మోసం.. వీబిజి రామ్ జి పథకాన్ని పక్కతోవ పట్టిస్తున్న అధికారులు. గ్రామంలో గ్రూపు మేటిని వదులుకొని… జిల్లా స్థాయి అధికారుల వరుకు వాటాలు… దింతో కష్టపడి పనిచేసే పేదల కడుపును ఉపాధి హామీ మాఫియా కొడుతున్నట్లు మండలంలోని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. తుగ్గలిలో జరిగే కోట్ల కుంభకోణం బయటపడుతుందా..? లేదా అనే చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా మారుతోంది. తుగ్గలి మండలంలో అమలవుతున్న ఉపాధి హామీ పథకం పూర్తిగా అవినీతి కూపంగా మారిందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. పేదల కోసం కేటాయించిన నిధులు కొంతమంది నాయకులు మరియు అధికారుల కుమ్మక్కుతో మాయం అవుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రౌండ్‌లో పనులు జరగకపోయినా బిల్లులు క్లియర్ అవడం, నకిలీ మస్టర్స్ తయారు చేయడం, కూలీల పేర్లతో డబ్బులు మళ్లించడం వంటి అక్రమాలు కొనసాగుతున్నాయని పలువురు తఆరోపిస్తున్నారు. నిజంగా పని చేసిన కూలీలకు మాత్రం వేతనాలు ఆలస్యంగా లేదా తక్కువగా అందుతున్నాయని మండలంలో ఉపాధి హామీ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై వెంటనే ఉన్నత స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఆందోళనకు దారి తీసే అవకాశం ఉందని ప్రతిపక్షాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నత స్థాయి అధికారులు ఎటువంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి మరి…!


