స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించండి 

స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించండి 

జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్

నంద్యాల న్యూస్ వెలుగు: స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు రాజకీయ పార్టీ ప్రతినిధులు సహకరించాలి జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్ పేర్కొన్నారు. గురువారం జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్ లో ఓటర్ల జాబితా రూపకల్పన పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో డిఆర్ఓ సమావేశం నిర్వహించారు. సమావేశంలో బీజేపీ పార్టీ ప్రతినిధి రవికుమార్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రియాజ్ బాషా, బిఎస్పీ పార్టీ ప్రతినిధి శ్రీనివాసులు, టిడిపి పార్టీ ప్రతినిధి శివరాం రెడ్డి, వైఎస్సార్సీసీపీ పార్టీ ప్రతినిధి సాయిరామ్ రెడ్డి, జనసేన పార్టీ ప్రతినిధి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ… స్వచ్ఛమైన తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహాయ సహకారాలు అందజేయాలన్నారు. ఓటర్ల జాబితాలో చనిపోయిన ఓటర్లు, మార్పులు, చేర్పులు, బూతు స్థాయి ఏజెంట్లతో పరిశీలించుకుని అభ్యంతరాలు ఉంటే ఈఆర్ఓ, ఏఆర్ఓలకు తెలియజేయాలని డిఆర్ఓ రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు. జిల్లాలో 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలన్నారు. ఓటర్ జాబితాకు సంబంధించి ఎటువంటి అనుమానాలు, సందేహాలు ఉన్నట్లయితే తమ పరిధిలోని బిఎల్ఓ లను సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీ ప్రతినిధులు సూచించిన అంశాలను ఎన్నికల సంఘానికి నివేదిస్తామన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS