హనుమాన్ జయంతి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి

హనుమాన్ జయంతి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి

తుగ్గలి మే 10 ( న్యూస్ వెలుగు ) తుగ్గలి మండలం, జొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పగిడిరాయి గ్రామంలో ఆదివారం ఎస్‌ఐ ఎన్‌సి మల్లికార్జున గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం జరగనున్న హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించే రథోత్సవాన్ని గ్రామస్తులు ప్రశాంతంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు. వేడుకల సమయంలో ఎలాంటి గొడవలు, అల్లర్లు లేదా అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకోకుండా గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది షబ్బీర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS