దళితులపై పెరుగుతున్న వివక్షతను అడ్డుకుంటాం: ఎమ్మార్పీఎస్ బురుజుల పులికొండ 

దళితులపై పెరుగుతున్న వివక్షతను అడ్డుకుంటాం: ఎమ్మార్పీఎస్ బురుజుల పులికొండ 

పత్తికొండ (న్యూస్ వెలుగు) : గ్రామాల్లో రోజురోజుకీ కుల వివక్షత పెరిగిపోతుందని ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు బురుజుల పులికొండ అన్నారు. పత్తికొండ మండలం జూటూరు గ్రామంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసేందుకు అగ్రవర్ణాలు చేస్తున్న కుట్ర హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. గ్రామంలో నూతన దేవాలయం నిర్మించేందుకు దళితులు ఇచ్చిన ధన ధాన్యము పనికి వచ్చింది కానీ దళితులు ఆలయ ప్రవేశం చేసేందుకు మాత్రం అడ్డంకి వచ్చిందన్నారు. గ్రామ అభివృద్ధికి దళితులు అనేక విధాలుగా దోహదపడుతుంటే వారిని దేవాలయాల్లోకి రానివ్వకుండా అడ్డుకోవడం ఒక ముర్కత్వపు చర్య అని ఆయన అన్నారు. జూటూరు గ్రామంలో ఆలయ ప్రవేశం పై పత్తికొండ సిఐ కు వినతిపత్రం అందించినట్లు ఆయన తెలిపారు దీనిపై పూర్తిగా విచారణ చేపట్టి దళితులపై వివక్షత చూపిన వారిపై చట్టపైన చర్యలు తీసుకోవాలని సిఐను కోరినట్లు ఆయన తెలిపారు. దళితులకు వివక్షతతో చూసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేయాలని దీనిపై పూర్తి విచారణ చేసి ఎందుకు కారకులైన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎస్సీలు ఆలయ ప్రవేశం చేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం మరియు జిల్లా కలెక్టర్ దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వారికి శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

జూటూరు గ్రామంలో దళితులపై జరుగుతున్న ఈ అమానవీయ కోణాన్ని రాష్ట్ర ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు దళితులపై అక్రమ కేసులు దౌర్జన్యాలు దళిత భూముల ఆక్రమణలు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం దళితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా న్యాయం జరపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జూటూరు గ్రామ దళితులు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు వెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS