
ఆలయ ప్రవేశం దళితుల చట్టబద్ధహక్కు : ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ రామకొండ వెంకటేష్
పత్తికొండ ( న్యూస్ నౌ ) మే 16: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ గ్రామాల్లో అంటరానితనం వివక్షతతో దళితులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ రామకొండ వెంకటేష్ అన్నారు. పత్తికొండ మండలం జూటూరు గ్రామంలో దళితులు శనివారం ఆలయ ప్రవేశం చేయడం భారత రాజ్యాంగం వారికి కల్పించిన హక్కు అని వారన్నారు. దళితుల సమాన అవకాశాలు,హక్కుల కోసం ఎమ్మార్పీఎస్ పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరుగుతుందన్నారు. దళితుల వివక్షత పైన రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ప్రణాళికను రూపొందించడం జరుగుతుందన్నారు. దళితులు ఆర్థిక రాజకీయ, సామాజిక రంగాలలో చైతన్యవంతం చేసేందుకు ఎమ్మార్పీఎస్ పెద్ద ఎత్తున సభలను ఏర్పాటు చేస్తామన్నారు. అగ్రవర్ణాలు దళితులపై చేస్తున్న దాడులను వారు ఖండించారు.

Was this helpful?
Thanks for your feedback!

