FlatNews Buy Now
ఎస్సీ కార్పొరేషన్ నిధులను వెంటనే మంజూరు చేయాలి: రామకొండ వెంకటేష్ 

ఎస్సీ కార్పొరేషన్ నిధులను వెంటనే మంజూరు చేయాలి: రామకొండ వెంకటేష్ 

పత్తికొండ ( న్యూస్ వెలుగు ):-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ బడ్జెట్ నిధులను వెంటనే మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.శుక్రవారం పత్తికొండ పట్టణంలో స్థానిక ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు బురుజుల పులికొండ మాదిగ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ రామకొండ వెంకటేశ్వర్లు,మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వుచ్చూరప్ప మాదిగ,బొంతల నరసింహులు మాదిగ లు హాజరై వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎస్సీ కార్పొరేషన్ నిధులకు బడ్జెట్ కేటాయించి విడుదల చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేశారు.అయితే ఇప్పటివరకు ఎస్సీ కార్పొరేషన్ పై మాట్లాడే పరిస్థితి లేకపోవడం సిగ్గుచేటని అన్నారు.గత ప్రభుత్వం మాదిగలకు మాదిగ ఉప కులాలకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు.వాటిపై ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేస్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న కార్పొరేషన్ నిధులను మంజూరు చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇవ్వడంతో మాదిగ ఉప కులాల ప్రజల్లో ఆనందం కనిపించిందని కానీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల పూర్తయిన ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన నిధులను కేటాయించి వెంటనే మంజూరు చేసి దళిత ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చందోలి ముత్యాల ప్రసాద్ మాదిగ రామాంజనేయులు మాదిగ సుధాకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS