
కురువలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.. కర్నూలు జిల్లా కురువ సంఘం
ఎమ్మిగనూరు, న్యూస్ వెలుగు : ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామం,మంగళవారం (02-06-2026) కురువ నాగేష్‌పై వాల్మీకి నాయకులు జరిపిన దాడిని కర్నూలు జిల్లా కురువ సంఘం తీవ్రంగా ఖండించింది.ఈ దాడిని సంఘం నాయకులు పిరికిపందల చర్యగా అభివర్ణించారు. సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించాలని, విభేదాలు మరియు విద్వేషాలను విడనాడాలని వారు పిలుపునిచ్చారు. వాల్మీకి సోదరులు అగ్రవర్ణాల ప్రభావానికి లోనుకాకుండా, పరస్పర గౌరవం మరియు సహకారంతో ముందుకు సాగాలని సూచించారు. మీకు దమ్ముంటే మేము ఎమిటో చూపిస్తామని కురువ సంఘం జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కే రంగస్వామి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ధనుంజయ కె.టి. ఉరుకుందు, పిల్లిగుండ్ల నాగన్న, గార్లదిన్నే రామాంజినేయులు, బి. వెంకటేశ్వర్లు, బి. రామకృష్ణ, బి. సి. తిరుపాలు,దైవందీన్నే ఈరన్న పాల్గొన్నారు.

