భూగేని చెరువు అభివృద్ధి పనులను రాకేష్ రెడ్డి

భూగేని చెరువు అభివృద్ధి పనులను రాకేష్ రెడ్డి

కోసిగి, న్యూస్ వెలుగు  09  జూన్ : కోసిగి పట్టణం 3, 4 వార్డుల పరిధిలో ఉన్న భూగేని చెరువు ప్రాంతంలో ఇటీవల రూ.48 లక్షల వ్యయంతో ప్రారంభించిన అభివృద్ధి పనులను మంత్రాలయం టీడీపీ ఇంచార్జి శ్రీ ఎన్. రాఘవేంద్ర రెడ్డి తనయులు యువ నాయకుడు నియోజకవర్గం ఎన్.రాకేష్ రెడ్డి మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా చెరువు పరిసర ప్రాంతాల్లో

చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని యువనాయకులు అధికారులనుస్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న వాకింగ్ ట్రాక్ బెంచీలు సోలార్ లైట్లు చిన్నారుల పార్క్, ఆట వస్తువులు ఆకర్షణీయమైన ఆర్చ్ నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.
కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కోసిగి పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి అభివృద్ధి పనిని నాణ్యతతో పూర్తి చేయాలని రాకేష్ రెడ్డి గారు సూచించారు. భూగేని చెరువు ప్రాంతాన్ని పట్టణ ప్రజలకు ఒక ప్రత్యేక విహార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.*
ఈ సందర్శనలో కోసిగి టీడీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS