
బాలయ్య బర్త్‌డే… కౌతాళం కృష్ణావదూత ఆశ్రమంలో మహా రక్తదాన శిబిరం
పెద్ద ఎత్తున పాల్గొన్న చెన్న బసప్ప యువ నాయకులు దివాకర్ రెడ్డి , కో ట్రేష్ గౌడ్ , సుబ్రహ్మణ్యం రాజు, దొడ్డన గౌడ
కౌతాళం, న్యూస్ వెలుగు : ఈ సేవా యజ్ఞానికి NBK ఫ్యాన్స్ రహిమాన్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పాలకుర్తి తిక్కా రెడ్డి తనయుడు దివాకర్ రెడ్డి, కర్నూలు జిల్లా మాజీ ఉపాధ్యక్షులు శ్రీ చెన్న బసప్ప విచ్చేసి కార్యక్రమానికి వన్నె తెచ్చారు. వారు జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు.

సినిమాల్లో డైలాగ్ కొడితే థియేటర్ దద్దరిల్లుతుంది నిజ జీవితంలో సేవ చేస్తే పేదోడి కంట్లో ఆనందబాష్పం రాలుతుంది ఆయన ఎప్పుడూ చెప్పే మాట ఒకటే సేవ చేయండి మనిషిగా బతకండి మనం చేస్తున్న ఈ రక్తదానం ఆయనకు ఇచ్చే అతిపెద్ద బర్త్‌డే గిఫ్ట్
ఒక యూనిట్ రక్తం ఒక ప్రాణం ఇక్కడ వందల యూనిట్లు అంటే వందల కుటుంబాల్లో దీపం వెలిగించినట్ట బాలయ్య అభిమాని అంటే కటౌట్‌కు దండలు వేసేవాడు కాదు కష్టంలో ఉన్నోడికి అండగా నిలబడేవాడు ఈ కృష్ణావదూత ఆశ్రమం వేదికగా మనం మొక్కుకుందాం ప్రతి ఏటా బాలయ్య బాబు పుట్టినరోజును ఇలాగే సేవా దినోత్సవంగా జరుపుకుందాం సింహం లాంటి మా బాలయ్య బాబుకి.ఆ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మరో 100 ఏళ్లు తెలుగు జాతిని ఇలాగే గర్జించి కాపాడాలని కౌతాళం గడ్డ మీద నుంచి కోరుకుందా జోహార్ ఎన్టీఆర్ జై బాలయ్య రక్తదానం చేయండి ప్రాణదాతలు అవ్వండి
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొట్రాష్ గౌడ్ సుబ్రహ్మణ్యం రాజు దొడ్డన గౌడ్ కురుగోడప్ప విజయరామ రెడ్డి శివప్ప గౌడ్ సిద్దు చిరంజీవి సోమన్న మరియు నందమూరి అభిమానులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

