పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు తగ్గించాలి

పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు తగ్గించాలి

పెంచిన ఎరువులు ధరలు తగ్గించాలి.

రైతులకు నష్టదాయకమైన ఎరువులు యాప్ ను రద్దు చేయాలి.

కౌతాళం 09 జూన్ , న్యూస్ వెలుగు:  కౌతాళం టౌన్ లో వామపక్షాల ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ,ఎరువులు ధరలను తగ్గించాలని సిపిఎం ఆఫీసు నుంచి ర్యాలీగా వెళ్లి సర్కిల్ నందు రాస్తారోకో నిర్వహించడమైనది. ఈ రాస్తా రోకో కు సిపిఎం పార్టీ మండల కన్వీనర్ బి ఈరన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కే మల్లయ్య, రైతు కూలి సంఘం మండల కార్యదర్శి జగదీష్ సంయుక్తంగా మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఎరువుల ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై భారాన్ని మోపిందని వారు విమర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ద్వారా రవాణా రంగంపై భారాలు పడి నిత్యవసర వస్తువుల రేట్లు భారీగా పెరుగుతాయని వారు అన్నారు పెట్రోల్ డీజిల్ రేట్లు యుద్ధం కారణంగా పెరిగాయని చెబుతున్న నరేంద్ర మోడీ యుద్ధం రావడానికి కారణమైన ట్రంప్ విధానాలను ఎందుకు బలపలపరుస్తున్నారని వారు ప్రశ్నించారు రష్యా నుండి ఆయిల్ దిగుమతి తగ్గించడం వల్లే మనపైన భారీగా భారాలు పెరిగిందని వారు తెలిపారు. పెట్రోల్ డీజిల్ రేట్లు ఊహకు అందనంత రీతిలో పెరిగినాయని వారు అన్నారు.
రైతులకు వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని, రైతులకు నష్టదాయకమైన ఎరువుల యాప్ ను తీసుకురావడం వల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురి అవుతారని వారు అన్నారు. ఎరువులు ఒక బస్తా మీద 300 నుంచి 600 రూపాయలు వరకు పెంచి రైతులకు భారాలు మోపుతున్నారని వారు విమర్శించారు. ఒకపక్క రైతుల మేలు కోరుకుంటామంటూ పరోక్షంగా రైతులకు నష్టదాయకమైన విధానాలు అవలంబిస్తున్నారని వారు అన్నారు. ప్రభుత్వ విధానాలకు అందరూ ఏకమై ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా పిలుపు ఇవ్వడం అయినది.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS