
హోటల్లు రెస్టారెంట్లు స్ట్రింట్ ఫుడ్ వెండర్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.!
మంత్రాలయం, న్యూస్ వెలుగు : 09 : జూన్ : భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) దేశంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ వెండర్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై తినుబండారాలను వార్తాపత్రికలలో (Newspapers) ప్యాక్ చేయడం లేదా వడ్డించడంపై తక్షణమే నిషేధం విధించింది. ఇటీవల ముంబైలోని ఒక ప్రముఖ వడా-పావ్ విక్రేత వార్తాపత్రికల్లో ఆహారాన్ని అందిస్తుండగా అధికారులు పట్టుకుని ఉమ్మడి చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే FSSAI ఈ కఠిన నిర్ణయాన్ని ప్రకటించింది.
వార్తాపత్రికల ముద్రణకు ఉపయోగించే సిరాలో (Ink) సీసం (Lead), రంగులు, విషపూరిత రసాయనాలు ఉంటాయని ష్టం చేసింది. వేడి ఆహారాన్ని పేపర్‌పై ఉంచినప్పుడు ఆ సిరా ఆహారంలో కలిసిపోతుంది. దీనివల్ల కాలక్రమేణా శరీరంలోకి ‘స్లో పాయిజన్’ (ధీమా జహర్) చేరి, ప్రాణాంతక వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ఈ రూల్స్ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

