మత సామరస్యానికి ప్రతీకగా పీర్ల స్వామి ఆలయ ప్రారంభోత్సవం

మత సామరస్యానికి ప్రతీకగా పీర్ల స్వామి ఆలయ ప్రారంభోత్సవం

తుగ్గలి, జూన్ 12 న్యూస్ వెలుగు : తుగ్గలి మండల పరిధిలోని కొత్తపల్లి గుడిసెలు గ్రామంలో పీర్ల స్వామి ఆలయ ప్రారంభోత్సవం శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి

గా హాజరై ఆలయాన్ని ప్రారంభించారు. కొత్తపల్లి గుడిసెలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సలహా మండలి సభ్యుడు వెంకటపతి మరియు మాజీ సర్పంచ్ సలహాదారు దేవేంద్ర తమ సొంత ఖర్చుతో రూ. 6 లక్షలు వెచ్చించి ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పీర్ల స్వాములకు ప్రార్థనలు చేశారు. గ్రామస్తులందరికీ శాంతి, సోదరభావం, సంతోషం మరియు శ్రేయస్సు కలగాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు కృష్ణ, నరసింహ చౌదరి, బత్తిని లోకనాథ్ లు మాట్లాడుతూ, హిందువులు మరియు ముస్లింలు సమానంగా ఆరాధించే పీర్ల స్వామి కోసం తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆలయాన్ని నిర్మించిన వారి చొరవను అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను మరియు మత సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప, టీడీపీ నాయకులు చెన్నంపల్లి అక్బర్ బాషా, కోటేశ్వర్ గౌడ్, రామలింగయ్య పల్లె రవికుమార్, గిరిగేట్ల బలరాముడు తదితరులు గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS