
తుగ్గలిలో పీహెచ్సీలను పరిశీలించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
తుగ్గలి, జూన్ 12 న్యూస్ వెలుగు : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.కామేశ్వర ప్రసాద్ శుక్రవారం మండల కేంద్రమైన తుగ్గలి, పగిడిరాయి ( పీహెచ్సీలను ) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి అక్కడి వైద్య సేవల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, రోగులకు అందజేస్తున్న చికిత్స, ఔషధాల నిల్వలు, సిబ్బంది హాజరు, పరిశుభ్రత తదితర అంశాలను ఆయన పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఔషధాల కొరత లేకుండా చూసుకోవడంతో పాటు ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని డా.కామేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు డాక్టర్ కిరణ్, డాక్టర్ అనిల్ కుమార్, స్టాఫ్ నర్సులు మహేశ్వరి, రాజేశ్వరి, పీహెచ్ఎన్లు రామక్క, సరస్వతి, ఎంపీహెచ్ఈవోలు బండయ్య, వెంకటరామయ్య, సూపర్వైజర్ నాగమ్మ, ఫార్మాసిస్ట్ రమేష్, ల్యాబ్ టెక్నీషియన్ మౌలాలి, ఏఎన్ఎంలు శ్రీదేవి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

