తుగ్గలి పీజీఆర్ఎస్ లో ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి

తుగ్గలి పీజీఆర్ఎస్ లో ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి

ఒక్క నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనల కార్యక్రమంలో భాగంగా పత్తికొండ నియోజకవర్గంలో తొలి పర్యటన

తుగ్గలి, జూన్ 12 న్యూస్ వెలుగు : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటికి పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన “ఒక్క నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా పత్తికొండ నియోజకవర్గంలో జిల్లా అధికారుల

తొలి పర్యటన శుక్రవారం ప్రారంభమైంది. తుగ్గలి మండల కేంద్రంలోని సాధన ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలపై తమ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రైతులకు రావాల్సిన పంటల బీమా పరిహారం వారి ఖాతాల్లో జమ చేయాలని, గుంతకల్ నుంచి మార్కాపురం వెళ్లే ప్యాసింజర్ రైళ్లను తుగ్గలి రైల్వే స్టేషన్‌లో నిలిపివేయాలని కోరారు. అలాగే తుగ్గలిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అర్హత మేరకు హాస్టల్ సీట్లు కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖలకు పంపించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, గ్రామీణ ప్రాంత ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని ప్రాధాన్యతతో స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఓబులేసు, డీఎస్పీ వెంకటరామయ్య, తహసీల్దార్ ఎస్. రవి, ఎంపీడీవో విశ్వమోహన్, వ్యవసాయ అధికారి సురేష్ బాబు, వైద్య అధికారులు డాక్టర్ కిరణ్, డాక్టర్ అనిల్ కుమార్, ఏపీడీ దాసరి లక్ష్మన్న, ఏపీవో రామకృష్ణ, ఇంజనీర్లు వెంకటేశ్వర్లు, మయాంక్, ఈసీ రాజశేఖర్, ఎంఈఓలు వెంకటేశ్వర్లు, ప్రవీణ్‌తో పాటు జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పత్తికొండ రూరల్ సీఐ పులి శేఖర్ ఆధ్వర్యంలో జొన్నగిరి తుగ్గలి ఎస్ఐలు మల్లికార్జున నరేష్ లు ఎలాంటి సంఘటనలు జరగకుండా బందా బస్తు నిర్వహించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS