ఎస్టీల హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

ఎస్టీల హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప

తుగ్గలి, జూన్ 12  న్యూస్ వెలుగు : రాష్ట్రంలో ఎస్టీ (గిరిజన) వర్గాలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు వారి హక్కులను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప అన్నారు. శుక్రవారం తుగ్గలి మండల పరిధిలోని కొత్తపల్లె గుడిసెలలో రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సలహా మండలి సభ్యులు వెంకటపతి నివాస గృహంలో నిర్వహించిన ఎస్టీల సమావేశానికి వెంకటప్ప ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఎస్టీలకు విద్య, ఉపాధి, ఆరోగ్యం, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గిరిజనుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అలాగే ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో గిరిజన సలహా మండలి సభ్యులు వెంకటపతి, ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాగిరి చంద్రప్ప, మాజీ సర్పంచ్ రంగమ్మ, మాజీ ఎంపీటీసీ తిరుపాలు, మాజీ సర్పంచ్ సలహాదారుడు దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS