FlatNews Buy Now
మీనాక్షి నటరాజన్  నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే

అనంతరత్నమ్ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు అసెంబ్లీ ఇంచార్జ్

న్యూస్ వెలుగు కోడుమూరు : కోడుమూరు కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో
ఈ సందర్భంగా అనంతరత్నమ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఏఐసీసీ కార్యదర్శి శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషన్‌ను

తిరస్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే చర్య ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదు రాజ్యాంగం కల్పించిన హక్కులను పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలను అణగదొక్కే ప్రయత్నం నిబంధనల పేరుతో రాజకీయ కక్ష సాంకేతిక కారణాలు చూపి ఒక జాతీయ స్థాయి మహిళా నాయకురాలి నామినేషన్‌ను అడ్డుకోవడం వెనుక రాజకీయ కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది మహిళా ప్రాతినిధ్యంపై దెబ్బ పార్లమెంటులో మహిళల వాటా పెంచాలని మాటలు చెబుతూ అవకాశం వచ్చినప్పుడు అడ్డుకోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం మీనాక్షి గారు గాంధేయవాదిగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే నాయకురాలిగా గుర్తింపు పొందారు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన వ్యవస్థలు అధికార పక్షం ఒత్తిళ్లకు తలొగ్గితే ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుంది ఇది రేపటి తరాలకు ప్రమాదకర సంకేతం కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తోంది
నామినేషన్ తిరస్కరణపై న్యాయపరమైన ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం కొనసాగిస్తామన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS