తుగ్గలి లోని అంగన్వాడీ కేంద్రాలపై  ఆకస్మిక తనిఖీలు చేసిన ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్

తుగ్గలి లోని అంగన్వాడీ కేంద్రాలపై  ఆకస్మిక తనిఖీలు చేసిన ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్

తుగ్గలి ( న్యూస్ వెలుగు ): మండల కేంద్రం తుగ్గలిలోని అంగన్వాడీ కేంద్రాలను ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ విజయ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహార పంపిణీ విధానాన్ని పరిశీలించారు. పాలు, గుడ్లు, ఇతర పోషకాహార సరఫరాకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందుతున్నదా అనే విషయాన్ని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ఐదేళ్లలోపు పిల్లలు ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రాలకు హాజరయ్యేలా అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం అర్హులైన గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు క్రమం తప్పకుండా అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS