గ్రామాలలో ఎల్.నినో ప్రభావం మీద అవగాహన సమావేశాలు 

 గ్రామాలలో ఎల్.నినో ప్రభావం మీద అవగాహన సమావేశాలు 

న్యూస్ వెలుగు ఆదోని : ఇందులో భాగంగా బైచిగేరి, అరెకల్, నాగలాపురం మరియు గుడికల్ గ్రామాలు వంటి తీవ్ర ఎల్లినో ప్రభావాన్ని ఎదుర్కొంటున్నట్లు ప్రకటించబడిన గ్రామాల్లో వివిధ పంటలను సందర్శించి రైతులతో ముఖాముఖి చర్చించడం జరిగింది. వర్షాలు ఆలస్యమైన ఈ సమయంలో ఏ ఏ పంటలను వేసుకోగలము అనే అంశాలపై రైతులను సన్నద్ధం చేయడం జరిగింది. ఆగస్టు చివరి వారం వరకు వర్షాలు ఆలస్యం అయితే తక్కువ కాల పరిమితి కలిగిన పంటలైన అలసందలు, పెసలు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు వంటి చిరుధాన్యాలని మరియు పప్పు ధాన్యాల పంటలను వేసుకొని రైతులు తమ పొలాలను ఖాళీగా ఉంచకుండా తదుపరి రబీలో సన్నద్ధమవ్వాల్సిందిగా కోరడం జరిగినది. ప్రస్తుతం పొలాల్లో ఉన్నటువంటి పత్తి, మిరప, ఉల్లి మరియు వేరుశనగ వంటి పంటలలో వివిధ సమస్యలపై చర్చించడం జరిగింది. పత్తిలో మెగ్నీషియం సల్ఫేట్ 1 % వంటి మందులను ఆకులపై పిచికారి చేసి మెగ్నీషియం పోషక లోపాన్ని సవరించుకోవలసినదిగా రైతులకు తెలియజేయడం జరిగింది. వర్షం రాక పంట గెడస బారి ఉన్నచోట పంట కీలక దశల్లో ఉన్నప్పుడు పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని 5 గ్రాములు లీటరు నీటికి చొప్పున లేదా 19:19: 19 లేదా యూరియా 20 గ్రాములు కలిపి ఒక ఎకరా కి పిచికారి చేయాలి. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము నంద్యాల శాస్త్రవేత్త డా. ఎస్. ఇషా పర్వీన్, డా.ఎం. జయలక్ష్మి , డా. ఆర్. నసీరుద్దీన్, డా. బి. హ్. చైతన్య, డా. సతీష్ బాబు, శ్రీ.వీ సాగర్ (TA), కెవికె బనవాసి శాస్త్రవేత్త డాక్టర్ ఎం. వి. నిరంజన్ రెడ్డి మరియు మండల వ్యవసాయ అధికారి శ్రీ. సుధాకర్ గారు RSK సిబ్బంది VAAs రామకృష్ణా మరియు మానస, జె. సి. దివాకర్ రెడ్డి వ్యవసాయ కళాశాల సిబ్బంది డా. మొహమ్మద్ షఫీ, డా. ప్రేమ్ సాగర్, రమాదేవి, రేవతి గారు మరియు రైతులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS