
కల్వర్టును యథావిధిగా వేయండి
హోలగుంద,న్యూస్ వెలుగు:మండల కేంద్రంలో బళ్లారి రహదారి సాయిబాబా గుడి వెనుక భాగంలో ఉన్న కల్వర్టు యథావిధిగా ఏర్పాటు చేయాలని శనివారం రైతు సంఘం నాయకులు కృష్ణయ్య,టిడిపి సీనియర్ నాయకులు గాలి వీరభద్ర గౌడ కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీల్లో వర్షపు నీళ్లు వెళ్ళే కల్వర్టు తారు రోడ్డు వేయడంతో మూసి పోయింది.దీంతో వర్షపు నీళ్లు ముందుకు కదలకుండా కాలనీల్లో నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కావున మూసి పోయిన కల్వర్టును వెంటనే తీసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప,వలి,శ్రీ రంగ,బాగోడి రామ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!