
రంగస్వామి సినిమాను ఆదరించండి…
జమ్మలమడుగు డిస్ట్రిబ్యూటర్ పొన్నతోట జయచంద్ర..
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; ఈనెల 25వ తేదీన జమ్మలమడుగు స్థానిక సాయిరాం థియేటర్లో రంగస్వామి సినిమా విడుదల కానుంది. ఈ సినిమా రాయలసీమ ప్రాంతంలో చిత్రీకరించారు. ఈ సినిమా ముఖ్య ఉద్దేశం ఒక తండ్రి కొడుకు కోసం ఏ విధంగా తపన పడతాడో, అలాగే విద్యార్థి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితం ఎలా కోల్పోతాడో ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు డైరెక్టర్ నరసింహ చారి కావున ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. ఈ రాయలసీమ ప్రాంత వాసి అయిన డైరెక్టర్ నరసింహ గారిని ప్రజలు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అని జమ్మలమడుగు డిస్ట్రిబ్యూటర్ ఉన్న తోట జయచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Ponnathota Jayachandra
 Ponnathota Jayachandra