
యూనివర్సిటీ కబడ్డీ కి ఆర్ యు మహిళా జట్టు ఎంపిక
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు దక్షిణ మండల అంతర్ విశ్వవిద్యాలయాల కబడ్డీ పోటీలకి రాయలసీమ యూనివర్సిటీ జట్టు ఎంపికైనట్టు అసిస్టెంట్ డైరెక్టర్ ఫిజికల్ ఏడుకెషన్ డైరెక్టర్ శివ కుమార్ ప్రకిటించారు, ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు తమిళనాడు కరకుడి. జిల్లా లోని అలగప్ప యూనివర్సిటీ లో పోటీలు నిర్వహిస్తున్నారు . ఈ పోటీలలో రాయలసీమ విశ్వవిద్యాలయం జట్టు పాల్గొంటుంది. ఈ సందర్భంగా యూనివర్సిటీ లో క్రీడా దుస్తుల పంపిణీ జరిగింది కార్యక్రమం లో రాయలసీమ విశ్వవిద్యాలయం ఉపకులపతి Prof NTK నాయక్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ మంచి ప్రతిభ కనబరిచి యూనివర్సిటీ కి మంచి పేరు తేవాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాయలసీమ విశ్వవిద్యాలయం రిజిస్టర్ Dr బోయ విజయ్ కుమార్ నాయుడు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ కె.వి శివ కిషోర్, యూనివర్సిటీ కబడ్డీ జట్టు మేనేజర్ పాల్గొన్నారు. మహిళా జట్టు వివరాలు జి. కీర్తి st జోసెఫ్ ఉమెన్స్, డి. పద్మ రామకృష్ణ డిగ్రీ కాలేజీ, నంద్యాల,ఎం. మంచాల తేజ SML డిగ్రీ కాలేజీ ఏమిగనూరు, ఎస్. శ్రావణి, పి.రేవతి ,శ్రీలక్ష్మి బీపీడ్ కాలేజీ, ఏ. సుమతి,టీ. భారతి, డి. మంజుల,శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజీ సి. గాయత్రి, జి. హర్షిత st జోసెఫ్ డిగ్రీ కాలేజీ తదితరులు పాల్గొన్నారు.