FlatNews Buy Now
ఘనంగా  ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్-327  జెండా ఆవిష్కరణ కార్యక్రమం 

ఘనంగా  ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్-327  జెండా ఆవిష్కరణ కార్యక్రమం 

న్యూస్  వెలుగు కర్నూలు: వై.వి. రాఘవరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి. రాఘవరెడ్డి, సీనియర్ అడ్వైజర్

కె. రాఘవేంద్ర ప్రసాద్, రీజినల్ ప్రెసిడెంట్ ఎస్. లక్ష్మీకాంత్ రెడ్డి, కంపెనీ సెక్రటరీ ఆర్. మురళీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ జె. ప్రహ్లాద్ చారి తదితర రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డీఏతో పాటు ఇతర బకాయిల చెల్లింపుల కోసం యాజమాన్యం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. అలాగే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కూడా యూనియన్ అండగా నిలుస్తుందని, ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యూనియన్ నాయకులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS