
పవన్ కళ్యాణ్ ని కలిసిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్
అమరావతి, న్యూస్ వెలుగు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ప్రతినిధులు కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ భేటీలో నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాల్లో పల్లెపండగ, సాస్కీ తదితర కార్యక్రమాల సౌకర్యాలు కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన తండాల్లోని పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాన్ షెడ్యూల్డ్ గిరిజన ఆవాసాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ముందుకు తీసుకువెళ్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా బంజారా సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు చక్రి నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రాంబాబు నాయక్, ఉపాధ్యక్షులు దొరస్వామి నాయక్, యూత్ ప్రెసిడెంట్ విష్ణుమూర్తి నాయక్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

