పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డిఐఈఓ

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డిఐఈఓ

నంద్యాల జిల్లా (న్యూస్ వెలుగు ): శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలను నంద్యాల జిల్లా డి.ఐ.ఇ.ఓ. బి. శంకర్ నాయక్ , డి.ఇ.సి. సభ్యులు బి. సునీత, సి. సుంకాన్న, వారి బృందం పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు మౌలిక వసతులు పై , సంతృప్తి వ్యక్తం చేశారని కళాశాల చీఫ్ సూపరిండెంట్ వెంకట నారాయణ వెల్లడించారు. అనంతరం వారు మాట్లాడుతూ ..జనరల్ కెమిస్ట్రీ పేపర్ – I పరీక్షకు 229 మందికి గాను 226 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ముగ్గురు విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షలు సి.సి. కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుందని, మంగళవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS