మూడు నెలల్లో టమోటా జ్యుస్ ఫ్యాక్టరీ అందుబాటులోకి.! కలెక్టర్

మూడు నెలల్లో టమోటా జ్యుస్ ఫ్యాక్టరీ అందుబాటులోకి.! కలెక్టర్

KURNOOL : పత్తికొండలో నిర్మాణంలో ఉన్న టమాటా ప్రాసెసింగ్ యూనిట్ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు యొక్క ప్రస్తుత స్థితి, మౌలిక వసతుల అభివృద్ధి, యంత్రాల ఏర్పాటు, నిర్మాణ పనుల వేగం మరియు ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన చర్యలపై విస్తృతంగా చర్చించారు.ప్రాజెక్టు అమలులో ఎటువంటి జాప్యం జరగకుండా అన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా, ఈ ప్రాజెక్టును వచ్చే మూడు నెలలలోపు పూర్తిచేసి ప్రజలకు మరియు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (APFPS), హార్టికల్చర్ శాఖ మరియు ఇతర అనుబంధ శాఖల అధికారులకు సూచించారు. ఈ టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం ద్వారా స్థానిక టమాటా రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు లభించడంతో పాటు, పంటకు విలువ ఆధారిత ప్రాసెసింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, తద్వారా రైతుల ఆదాయం పెరగడానికి మరియు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో శ్రీ శంకర్ నాయక్, మేనేజర్, APFPS, డా. శ్రీనివాసులు, ప్రాజెక్ట్ డైరెక్టర్ (APMIP), శ్రీ రామాంజినేయులు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, శ్రీ అజయ్ కుమార్, APFPS, శ్రీ శ్రీహరి, అసిస్టెంట్ ఇంజనీర్, AP పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS