
ఒకే సమస్యపై 60 మంది ఫిర్యాదు ..!
ప్రభుత్వ భూమి ఆక్రమణపై వెల్లువెత్తిన ఫిర్యాదులు
సామాన్యుడికి రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలంటే సవాలక్ష ప్రశ్నలు
కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములు ఎలా ఆన్లైన్ చేశారని ప్రశ్నించిన స్థానికులు
దొడ్డి దారిలో ప్రభుత్వ భూమి స్వాహా ….
కోర్టులో పంచాయితీ ఉన్న … ఎంచక్కా భూమిని దున్నీ సాగుచేసిన ఘనుడు
ప్రభుత్వ భూములపై కొరవడిన రక్షణ
పట్టించుకోని రెవెన్యూ అధికారులు …..
పత్తికొండ (న్యూస్ వెలుగు ) -: పత్తికొండ: భూ కబ్జాదారుల నుండి ప్రభుత్వానికి చెందిన మల కలకుంట నీటి కుంటను అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ అధికారులు కాపాడి పరిరక్షించాలని ఎస్సీ కాలనీ వాసులు, పట్టణవాసులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పట్టణ ప్రజలు రైతులు, కాలనీవాసులు స్వచ్ఛందంగా వచ్చి మొలకల కుంటను కాపాడాలని పరిరక్షించాలని ఆర్డీవో ఓబులేష్ కు అర్జీలు సమర్పించారు. ఒకే సమస్యపై దాదాపుగా స్థానిక ప్రజలు 50 నుండి 60 మంది వరకు ప్రజలు అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు, ఎస్సీ కాలనీవాసులు, రైతులు మాట్లాడుతూ 203 సర్వే నంబర్ గల మొలకలకుంట ను 16 ఎకరాల 10 సెంట్లు విస్తీర్ణం గల ప్రభుత్వానికి చెందిన భూమిని అక్రమార్కులు భూ కబ్జాదారులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పట్టణానికి దగ్గరలో హైవే రోడ్డుకు పక్కనే ఉండటం వలన ఆ భూమి విలువ కోట్ల రూపాయలు పలుకుతుంది. దానిపై కన్నేసిన కబ్జాదారుడు గత పది రోజుల క్రితం భూమిని చదును చేసుకుని కబ్జా చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తే రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులకు విషయం తెలిపి నిలిపివేయడం జరిగిందన్నారు. మరలా ఎవరు లేని సమయంలో చదురు చేయడానికి ప్రయత్నించగా పొలాల్లో ఉన్న రైతులు, దగ్గర్లో ఉన్న ఎస్సీ కాలనీ వాసులు వెళ్లి అడ్డుకొని పంపించడం జరిగిందన్నారు. అప్పట్లో రెవెన్యూ అధికారులు అండదండలతో నకిలీ పాసు పుస్తకాలు పుట్టించుకుని ఇప్పుడు కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేయడానికి పూనుకోవడం దుర్మార్గమన్నారు. తాసిల్దార్ కార్యాలయంలో ఓ రెవెన్యూ అధికారి అండదండలు అక్రమ దారునికి ఉన్నాయన్నారు, పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడి అక్రమ దారులకు సహకరించడం అన్యాయమన్నారు , మలకలకుంటలో నీరు నిల్వ ఉండడం వలన భూగర్భ జలాలు పెరిగి రైతులకు సాగునీరు ప్రజలకు తాగునీరు ఇబ్బందులు తలెత్తకుండా ఉందన్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రజా అవసరాల కోసం ఉన్న మలకలకుంటను అక్రమ దారుల నుండి అన్యాక్రాంతం కాకుండా కాపాడి పరిరక్షించాలని కోరారు.


