
అనుమతి లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలపై తక్షణ చర్యలు తీసుకోవాలి
అనుమతులు లేని రెసొనెన్స్ విద్యాసంస్థల చైర్మన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
కర్నూలు, న్యూస్ వెలుగు: నగరంలోని స్థానిక బిర్లా కాంపౌండ్ నందు విద్యార్ధి సమాఖ్య కార్యాలయం విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో సమావేశం నిర్వహించారు.. ఈ సందర్బంగా బీసీ ఎస్సి ఎస్టీ మైనారిటీ విద్యార్ధి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వి. భరత్ కుమార్, రాయలసీమ విద్యార్ధి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవి కుమార్ మాట్లాడుతూకర్నూలు కేంద్రంగా కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, ముఖ్యంగా రెసొనెన్స్ విద్యాసంస్థతో పాటు మరో ఐదు సంస్థలు,రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు

ఈ విద్యాసంస్థలు తల్లిదండ్రులను తప్పుదారి పట్టిస్తూ, అనుమతి ఉన్న కళాశాలల పేర్లతో ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు నమోదు చేసి, వాస్తవానికి అనుమతి లేని ప్రాంగణాలలో తరగతులు నిర్వహించడం ద్వారా స్పష్టమైన మోసానికి పాల్పడుతున్నాయి.
కనీసం ఏ అనుమతి లేకున్నా కూడా చిత్ర విచిత్రమైన ప్రకటనలతో బూటకపు మాటలతో అడ్మిషన్స్ చేస్తూ పేద ప్రజలను విద్యార్థులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు..రెసొనెన్స్ అనే సంస్థ వ్యాపార సంస్థ లాగ తయారయ్యింది అని ఆవేదన వ్యక్తం చేసారు, అనుమతి లేకున్నా బయట బోర్డ్ లు ఏర్పాటు చేసుకొని అడ్మిషన్స్ చేస్తుంటే RIO గారు, నిద్ర వ్యవస్థ లో మామూళ్ళ మత్తులో మునిగితెలుతున్నారా అని ప్రశ్నించారు
ఈ చర్యలు విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీయడమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెడుతున్నాయి.
అనంతరం బిసిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ బాబు మరియు ఎపిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎద్దుపెంట అంజి మాట్లాడుతూ
ఈ అంశాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి మరియు సంబంధిత విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం విచారకరం. ఇది అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనం.
మా ప్రధాన డిమాండ్లు:
1. అనుమతి లేకుండా నడుస్తున్న అన్ని విద్యాసంస్థలపై తక్షణ తనిఖీలు నిర్వహించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
2. మోసపూరితంగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులను గుర్తించి, వారికి న్యాయం చేయాలి.
3. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన నియంత్రణలు అమలు చేయాలి.
4. తల్లిదండ్రులు మరియు విద్యార్థులకు అవగాహన కల్పించేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి.
విద్య అనేది వ్యాపారం కాదు – అది సమాజ నిర్మాణానికి మూలస్తంభం. అలాంటి పవిత్రమైన రంగంలో మోసాలకు తావు ఇవ్వడం అసహ్యం. ప్రభుత్వం మరియు ఇంటర్మీడియట్ బోర్డు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే…
విద్యార్థుల హక్కుల కోసం మేము నిశ్శబ్దంగా ఉండేది లేదు. తక్షణ చర్యలు తీసుకోకపోతే, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి ఈ సమస్యను రాష్ట్రవ్యాప్తంగా తీసుకెళ్తాము అని హెచ్చరించారు

