పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బార్లు.. ట్రాఫిక్ అంతరాయం

 పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బార్లు.. ట్రాఫిక్ అంతరాయం

నంద్యాల, న్యూస్ వెలుగు: వెలుగోడు మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద గురువారం సాయంత్రం వాహనదారులు బార్లు తీరారు.

దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయని, పుకార్ల నేపథ్యంతో ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం క్యూలు కట్టారు. అలాగే బండి ఆత్మకూరు మండలం బండి ఆత్మకూరు, సంత జుటూరు గ్రామాలలోని పెట్రోల్ డీజిల్ పంపుల వద్ద వినియోగదారులు బారులు తీరారు. నంద్యాల జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలియజేస్తున్నప్పటికీ ప్రజలు అవసరాలకు మించి డీజిల్, పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ సరఫరా పై సంబంధిత అధికారులు, యాజమాన్యాలు స్పష్టమైన సమాచారం ను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS