
పొన్నకల్లు గ్రామము లో జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలి
కర్నూలు న్యూస్ వెలుగు:కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్ గ్రామంలో గత ఆరు నెలల క్రితం ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన సంగతి విధితమే పోలీసు వారు ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తిపై ఫోక్సో నమోదు చేశారు.ఆ తదనంతరం గ్రామంలో కులజులపై లేనిపోని ఇబ్బందులు కలిగిస్తూ ఈ మధ్యనే కురువ వెంకటేష్, కురువ మద్దిలేటి, కురువ రాముడు ల బోర్ బావుల మోటార్లు తొలగించి బావిలో వేయడం జరిగింది.
అలాగే నిన్న రాత్రి తేదీ: 22.5. 26న రాత్రి 11:30 గంటలకు కురువ రాముడు, కురువ మిన్నల్ల,కురువ మద్దిలేటి కురువ వెంకటేష్ ల గడ్డివాములకు నిప్పు పెట్టారు. సుమారు 8 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది. నిప్పు పెట్టడం చాలా బాధాకరం కావున నిప్పు పెట్టిన వారిని పోలీసులు గుర్తించి వెంటనే వారపై తగు చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం.
Was this helpful?
Thanks for your feedback!

