గిరిగెట్ల పంచాయతీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన శివ

గిరిగెట్ల పంచాయతీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన శివ

గిరిగెట్ల పంచాయతీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన శివ

తుగ్గలి జూన్ 15 ( న్యూస్ వెలుగు  ): తుగ్గలి మండలం పరిధిలోని గిరిగెట్ల గ్రామ పంచాయతీ నూతన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన శివకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. సోమవారం గ్రామ సచివాలయానికి వచ్చిన ఆయనను ప్రజలు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి సత్కరించి అభినందించారు. ఇటీవల గిరిగెట్ల పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన గోపాల్‌కు పదోన్నతి లభించడంతో ఆయన బదిలీపై వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాతన పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న శివకు గిరిగెట్ల పంచాయతీకి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు శివ సోమవారం గిరిగెట్ల గ్రామ సచివాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు నూతన బాధ్యతలు చేపట్టిన శివకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బలరాముడు, రామాంజనేయులు, బోలా భీమలింగ, బోలా రంగస్వామి, బోలా మల్లికార్జున, బోలా రవి తదితరులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS