కోట్లు పెట్టి నిర్మించాం గేట్లకు తాళాలు వేయటం బాధాకరం మాజీ మంత్రి బుగ్గన 

కోట్లు పెట్టి నిర్మించాం గేట్లకు తాళాలు వేయటం బాధాకరం మాజీ మంత్రి బుగ్గన 

నంద్యాల న్యూస్ వెలుగు: వేలకోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేశాం, ఆ పనులు ప్రజలకు తెలియజెప్పలేకపోయాం సంక్షేమ పథకాలను అమలు చేయడంలోనూ గత ప్రభుత్వం ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొంది అయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించం,  అలానే డోన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం వందల వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను శంకుస్థాపనలు చేయడమే కాకుండా ప్రారంభించడం కూడా జరిగిందని,  కొన్ని పనులను మహాయంలో పూర్తయినప్పటికీ వాటిని ప్రారంభించలేకపోయామని మాజీ ఆర్థిక మంత్రి, వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం డోన్ పట్టణంలో గత ప్రభుత్వంలో జరిగిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను  పరిశీలించామన్నారు. వైసిపి హయాంలో టీటీడీ ఆధ్వర్యంలో రెండు కోట్లకు పైగా వ్యయంతో టిటిడి కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశామని దానిని కనీసం కూటమి ప్రభుత్వం ప్రారంభించుకోలేకపోవడం ప్రజలకు వినియోగంలోకి తెచ్చుకోకపోవడం సిగ్గుచేటని వారు అన్నారు. మా ప్రభుత్వం నిర్మించిన కనీస భవనాలను కూడా కూటమి ప్రభుత్వం వాడుకోలేక పోతుంది అంటే  కూటమి ప్రభుత్వ నాయకుల నిర్లక్ష్యమేనని వారన్నారు. టీటీడీ కల్యాణ మండపానికి తాళం వేసుకోవడం చాలా బాధాకరమని వారు అన్నారు ఈ కార్యక్రమానికి  నాయకులు శ్రీరాములు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!