
చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. రేవంత్ ప్రభుత్వానికి సవాల్
న్యూస్ వెలుగు, హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై వస్తున్న చెరువు కబ్జా ఆరోపణలపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ ఆరోపణలు నిరూపిస్తే సదరు ఆస్తిని తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్ విసిరారు. మంగళవారం హైదరాబాదులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“మేము ఒక చెరువుని కబ్జా చేశామంట, నాకేం పనిలేదా? నిజంగా మీరు అన్నట్టుగా కబ్జా చేస్తే నా ఇల్లు తగలబెట్టేసేవారు” అంటూ పవన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే చెబుతున్నానని పేర్కొన్నారు. ఆయనంటే తనకు ఇష్టం, గౌరవం ఉన్నాయని అన్నారు.
“పవన్ కల్యాణ్ ఒక చెరువును ఆక్రమించుకున్నాడని మీరు నిరూపిస్తే, ఈరోజు నేను సంతోషంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆ చెరువును రాసి ఇచ్చేస్తున్నాను” అని ఆయన అన్నారు. గతంలో కూడా తనను ఇబ్బంది పెట్టేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని పవన్ అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

